Tollywood news in telugu

Anand Devarakonda Baby Loading : బేబీ గా ఆనంద్ దేవరకొండ :-

Anand Devarakonda Baby Loading

Anand Devarakonda Baby Loading : చిత్రసీమ లో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన, తన నటన అభిమానులు మెచ్చుకోవాలి , తన అన్న మీద అభిమానంతో కాకుండా తన మీద అభిమానం తో సినిమాకి రావాలని చాల కొత్త కొత్త స్క్రిప్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే.

మిడిల్ క్లాస్ మెలోడీస్ ద్వారా ఓటీటీ బిగ్గెస్ట్ హిట్ కొట్టారు , దాని తర్వాత వరుసగా కంటెంట్ ఉన్న కథలు సైన్ చేసి, షూటింగ్ చేస్తూ వచ్చారు. అదే తరహా లో ఆనంద్ చేస్తున్న సినిమానే పుష్పక విమానం.

ఇదిలా ఉండగా ఇదివరకే ఆనంద్ కొత్త సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు జరిగాయి. ఆ సినిమా టైటిల్ వచ్చేసి బేబీ. ఈ సినిమాకి కొబ్బరి మట్ట దర్శకుడైన సాయి రాజేష్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన నిర్మాణ బాధ్యతలు యస్.కే.యన్ గారు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా ముహూర్తం కార్యక్రమం లో ఈ సినిమా మొదటి క్లాప్ అల్లుఅరవింద్ గారు కొట్టగా , కెమెరా ఆన్ చేసింది సుకుమార్ గారు , మొదటి షాట్ దర్శకత్వం వహించింది మారుతీ గారు. ఇలా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ల సమక్షం లో ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 న మొదలవబోతుంది. అయితే ఈ సినిమా లో ఆనంద్ దేవరకొండ తో పాటు విరాజ్ అశ్విన్ మరియు యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించబోతున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈ సినిమా చిత్రీకరించబడింది.

చూడాలి మరి ఈ సినిమా ద్వారా సాయి రాజేష్ గారు మరియు ఆనంద్ దేవరకొండ కలిసి బ్లాక్ బస్టర్ బేబీ ని డెలివరీ చేయాలనీ కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button