movie reviews

సినిమా :- అమ్మోరు తల్లి (2020)

ammoru thalli: నటీనటులు :- నయనతార ఆర్. జె. బాలాజీ , ఊర్వశి , అజయ్ గోష్. 
మ్యూజిక్ డైరెక్టర్:-  గిరీష్ గోపాలకృష్ణన్ 
డైరెక్టర్ :-  ఆర్.జే. బాలాజీ , యన్.జే శరవణన్

కథ:-ఈ కథ ఒక సాధారణ రిపోర్టర్ అయినా రామస్వామి(ఆర్ జె బాలాజీ) అనే మిడిల్ క్లాస్ వ్యక్తి నుంచి మొదలవుతుంది. రామస్వామి వాలా నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యత అంత తన ఒకడి మీదనే పడటం ఎన్నో పనులు తన చిన్న ఉద్యోగం చేయలేక అష్ట కష్టాలు పడుతుంటాడు. ఈ క్రమం లో తాను నకిలీ బాబా అయినా భగవతి బాబా(అజయ్ ఘోష్) చేసే అక్రమ పనులు స్కామ్స్ ని బయట పెట్టె పనిలో పడుతాడు. అనుకోకుండా అదే సమయం లో రామస్వామి యొక్క కుల దేవత అయినా అమ్మోరు తల్లి(నయనతార) వచ్చి అతని జీవితంలో చాలా మార్పులు తీసుకొనివస్తుంది. అసలు అమ్మోరు తల్లి ఎవరు ? రామస్వామి జీవితం లో ఎం మార్పులు చేసింది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ చిత్రం హాట్ స్టార్ లో చూసేయాల్సిందే.

👍

*  నయనతార ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటుంది. 
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు. 
*  కధనం చక్కగా వ్రాసుకున్నారు. 
* దర్శకుడు తాను చుపించాలనుకుంది ఎక్కడ తగ్గకుండా సైడ్ ట్రాక్ లేకుండా చూపించారు
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.

👎

* రొటీన్ స్టోరీ . 

ముగింపు :-
మొత్తానికి అమ్మోరు తల్లి అనే చిత్రం అని వర్గహల ప్రేక్షలకులకు ఆకట్టుకుంటుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. నయనతార అమ్మోరు తల్లి గా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆర్. జె. బాలాజీ ఒక దర్శకుడిగా ఒక రైటర్ గా ఒక యాక్టర్ గా ఎక్కడ తాగకుండా అన్నిటిని చక్కగా హ్యాండిల్ చేసారు. మ్యూజిక్ బాగుంది. కామెడీ సీన్స్ చాల బాగున్నాయి. కెమెరా వర్క్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి అమ్మోరు తల్లి సినిమా ఈ వారం కుటుంబం తో సహ హ్యాపీ గా చూసేయండి.

ammoru thalli రేటింగ్ :- 3/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button