amma rajashekar : అమ్మ అయ్యాడు అర్ధనారీశ్వరుడు… ! మరి సింపతీ వచ్చిందా?

bigg boss 4 telugu: బిగ్ బాస్ 4 లో నాగార్జున అదిరిపోయే సాంగ్ కి స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను శనివారం రోజు అలరించాడు. అనంతరం మన tv లో హౌస్ లో జరిగిన విషయాలు చూసి, చిన్న చిన్న విషయాలకే కొంతమంది ఫీలవుతున్నారు అని నాగార్జున కుటుంబ సభ్యులను ఉద్దేశించి అన్నాడు.
తరవాత ఆటలో భాగంగా ‘తెనాలి మినపగుళ్ళు’ రుబ్బి దోశ వేసే కాంపిటీషన్ లో లాస్య టీమ్ 12 దోశలు వేయగా, అమ్మ రాజశేఖర్ టీమ్ 15 దోశలు వేసి విజయం సాధించారు.
అయితే మాస్టర్ కి సోహెల్ కి మధ్య దోశలు వేసే కాంపిటీషన్ లో చిన్న చిన్న అపార్దాలు రావడంతో, సోహెల్ ని అమ్మ మాస్టర్ దొంగ అనడంతో సోహెల్ చాల బాధ పడ్డాడు, తన బాధని అఖిల్ తో పంచుకుంటూ మాస్టర్ నన్ను అలా అనకూడదు,తనేమన్న పుడింగా అని సోహెల్ మాస్టర్ ని అన్నాడు.
చివరికి గేమ్ లో నువ్వు దొంగవే, నేను దొంగనే అందరం దొంగలమే అనునుకుంటు వారికి వారు సద్దిచెప్పుకున్నాడు.
తరవాత నాగార్జున ఒక మైండ్ బ్లాక్ అయ్యే టాస్క్ ఇచ్చాడు అదేంటంటే, వచ్చే వీక్ నామినేషన్ లో ఉండకూడదంటే మీలో ఎవరు అర గుండు కొట్టించుకుంటారో చెప్పండి అనడంతో, ఆ టాస్క్ కి అమ్మ రాజశేఖర్ ముందుకు వచ్చాడు.

అలా ముందుకు వచ్చిన మాస్టర్ ని, కుటుంబ సభ్యులు అమ్మ ఇంకోసారి ఆలోచించుకో అని బ్రతిమిలాడారు. అయినాకని మాస్టర్ వినకుండా అరగుండు కొట్టించుకొని నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ నుండి బయట పడ్డాడు.
అరగుండు కొట్టించుకున్న అమ్మ రాజశేఖర్ ను నాగార్జున పొగుడుతూ అర్ధనారీశ్వరుడిలా కనబడుతున్నావని కితాబిచ్చాడు.
ఈలా శనివారం ఎంతో ఉత్కంఠ భరితంగా షో సాగింది.