BigB Amitabh: ప్రాజెక్ట్ కే చేస్తున్నందుకు గర్వంగా ఉంది ఎందుకంటే…
BigB Amitabh : ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవ్వరు ఉండరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్.. ఆ సినిమా తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపిన బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో,రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే సినిమాలు ప్లాప్ అయితేనేమి .. ప్రభాస్ క్రేజ్ ఇంత కూడా తగ్గలేదు.ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కె చిత్రాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సలార్ టీజర్ సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అదే విధంగా ప్రాజెక్ట కె మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. అయితే ప్రాజెక్ట్ కె మూవీ రిలీజ్ ముందే సంచలనాలు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా టైటిల్, ట్రైలర్ రిలీజ్ డేట్ లను హాలీవుడ్ ప్రముఖ సంస్థ అయిన సండియగో కామికాన్ లో జూలై 20న రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా ప్రాజెక్టు కె నిలిచింది. ఈ విషయం పై అమితాబచ్చన్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రాజెక్ట్ K’లో ఈ గొప్ప సంస్థలో భాగమైనందుకు గర్వపడుతున్నాను.నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు నాగి సర్ అంటూ అయన ట్వీట్ చేశారు.
