Political News

ఎన్నికల్లో రికార్డ్ బద్దలు, American elections break records

120 ఏళ్లలో ఇదే అత్యధిక ఓటింగ్… American elections break records అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 120 ఏళ్లలో అత్య ధిక ఓట్లు నమోదయ్యాయని ప్రముఖ ఎన్నికల నిపుణుల అభిప్రాయం . యుఎస్ ఎలెక్షన్ ప్రాజెక్ట్ అనే సంస్థ ప్రాథమిక అంచనాల మేరకు ఈ సారి మొత్తం అంచనా వేసిన ఓటర్ల సంఖ్య 23 కోట్ల 9 లక్షలు . వీరిలో సుమారు 16 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు . ముందుముందు ఈ సంఖ్య మారే అవకాశం ఉంది .

నవంబర్ 3 ఎన్నికలలో రికార్డు స్థాయిలో 66.9 % పోలింగ్ నమోదైంది . 1900 లో 73.7 % నమోదైన తర్వా త అత్యధిక ఓటింగ్ ఇదే కావడం గమనార్హం . 2016 లో ఇది 56 % కాగా , 2008 లో 58 % మాత్రమే . యుఎస్ ఎలెక్షన్ ప్రాజెక్ట్ ప్రకారం మినె సోటా , మెయిన్లో అత్యధికంగా 79.2 % ఓటింగ్ నమోదైంది . వీటి తర్వాత అయోవా 78.6 % తో రెండో స్థానంలో ఉంది . మెయిన్ , అయోవా ట్రంప్ ఖాతాలో చేరగా , మినెసోటాలో బైడెన్ విజేతగా నిలిచారు . American elections break records ప్రాథమిక అంచనాల మేరకు అత్యల్ప ఓటింగ్ అరకాన్సలో 56.1 % నమోదైంది . ఇక ప్రపంచంలో ఓటింగ్ తక్కువగా నమోదయ్యే వాటిలో అమెరికా ఒకటి . అయితే 2020 లో అది సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం అని టైమ్ మేగజైన్ పేర్కొంది . ప్యూ పరిశోధన ప్రకారం జాతీయ స్థాయి ఎన్నికల ఓట్ల నమోదులో 35 దేశాల్లో అమెరికా స్థానం 30. ఈ సారి బైడెన్ , ట్రంప్ ఇద్దరూ అత్యధిక ఓట్లు సాధించడం విశేషం . బైడె నకు 7 కోట్ల 20 లక్షల ఓట్లు పోలయ్యాయి . ఇది 2016 లో హిల్లరీ క్లింటన్ పొందిన ఓట్లకంటే 80 లక్షలు అధికం . ట్రంప్ కు 6 కోట్ల 85 లక్షల ఓట్లు నమోదయ్యాయి .

Read  సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..?

రిపబ్లికన్ అభ్యర్థులకు లభిం చిన అత్యధిక ఓట్లు ఇవే . ప్యూ పరిశోధన ప్రకారం అమెరికాలో నమోదైన ఓటర్లలో 69 శాతంతో శ్వేత జాతీయులు అతిపెద్ద వాటాను కలిగి ఉన్నారు . హిస్పానిక్లు , నల్లజాతీయులు చెరో 11 % , ఇతరులు మిగిలిన 8 % వాటి కలిగి ఉన్నారు . 70 % పైగా ఓటింగ్ నమోదైన ఇతర రాష్ట్రాలు : కొలరాడో- 77.1 , కనెక్టికట్- 71.1 , డెలావేర్ 70.8 , ఫ్లోరిడా -72.9 , మేరీలాండ్ -72.2 , మ సాచుసెట్స్- 73.4 , మిషిగన్- 73.5 , మోం టానా -72.3.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button