tooth paste benefits for face : ముఖానికి టూత్‌పేస్ట్ రాసుకుంటే ఏమవుతుందో తెలుసా…?
tooth paste benefits for face : మన దైనందిన జీవితంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ప్రాథమిక పదార్థాలలో టూత్‌పేస్ట్ ఒక్కటి. అయితే దంతాల శుభ్రత కొరకు వాడే టూత్‌పేస్ట్ ఒక సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు టూత్‌పేస్ట్‌ను సౌందర్య సాధనంగా ఎలా వాడాలో పరిశీలిద్దాం..
ఇందుకోసం మీరు ఎలాంటి వేరే పదార్థాలను వాడని తెల్లని టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఎరుపు, నీలపు రంగు పేస్ట్‌లను ఎంచుకోవద్దు. మిగతా వాటితో పోలిస్తే ఇందులో తక్కువ శాతంలో ఫ్లోరైడ్ వాడబడుతుంది. కనుక ఇది మిగతా వాటికంటే అత్యుత్తమంగా పనిచేస్తుంది.

టూత్‌పేస్ట్, అలోవేరా జెల్‌ను కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేయండి. తరువాత ఉదయం గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను తీసుకోని దానిలో కొద్దిగా పాలు పోసి మిశ్రమంలా కలుపుకోవాలి. అందులో దూదిని ముంచి ముఖంపై నల్లటి మచ్చలు, కంటి క్రింద ఉండే నల్లటి వలయాలపై మృదువుగా రాయండి. 3 నిమిషాలు ఆగి, ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయండి.
అయితే ఈ టిప్స్‌ను పాటించే ముందు కొద్ది పరిమాణాన్ని టెస్ట్‌గా చేతిపై అప్లై చేసి చూసుకోండి. ఎందుకంటే కొందరి చర్మానికి ఇది పడకపోవచ్చు. ఈ మిశ్రమాలను అప్లై చేసి ముఖాన్ని కడుక్కున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.