మతులు పోగొడుతున్న కీర్తి సురేష్

keerthi suresh : కీర్తి సురేష్ ని హోమ్లీ డాల్ గా తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకొని సినీ ఇండస్ట్రీలో రాణిస్తుంది. కీర్తి తన తల్లి నటవారసత్వాన్ని అంది పుచ్చుకొని మంచి గుర్తింపు పొందింది.
ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు, తాను 17అక్టోబర్ 1992. లో జన్మించింది. ఈ నటి తక్కువ వయస్సులోనే ఇంత స్టార్ డమ్ ని సంపాదించింది.
కీర్తి తన చిన్న వయసులోనే మలయాళ భాషలో ‘పైలట్స్’ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2013 లో మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇక తెలుగు విషయానికి వస్తే ‘నేను శైలజ’ అనే సినిమాలో రామ్ సరసన నటించి ఒక సూపర్ హిట్ ని కొట్టింది.
అలాగే నాని సరసన ‘నేను లోకల్ ‘ మరియు పవన్ సరసన ‘అజ్ఞాతవాసి ‘ లో నటించి హిట్ లు సాధించింది.

ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహా నటి ‘ సినిమాతో తన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించి మహానటి సావిత్రి పేరును మహానటి కీర్తి గా మలుచుకుంది.
ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తన కాతాలో వేసుకుంది.