health tips in telugu

Sorghum in telugu : జొన్నలతో ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ఉపయోగాలు..

Benefits of Sorghum or jonnalu : జొన్నలు ఒక మంచి పౌష్టికాహారం. వీటిని ఆహారంలో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో మేలైన పోషకాలతోపాటు ఫాస్పరస్‌, మాంగనీస్‌, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. జొన్నలను తరచూ తీసుకోవడం చాలా అవసరం.

జొన్నల్లో యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌ 2 డయాబెటిస్‌తోపాటు, నరాల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

జొన్నలలోని ఫైబర్‌ మన జీవక్రియను వేగవంతం చేసి, జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

ఉదర సంబంధిత సమస్యలకు చెక్‌పెట్టడానికి జొన్నలు ఎంతో దోహదపడతాయి. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్‌, ఎసిడిటి వంటి సమస్యల నుంచి బయటపడటానికి జొన్నలు ఎంతో సహాయపడతాయి.

అధిక బరువుతో బాధపడేవారు జొన్నలను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఇందులో ఇనుము, జింక్‌ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అందువల్ల శరీరంలో అధిక క్యాలరీలు పెరగకుండా చేయడమే కాకుండా, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

అనారోగ్యంతో బాధపడేవారికి జొన్నలు సరైన ఆహారం. ఇవి సత్వర శక్తిని అందించి శరీరాన్ని బలోపేతం చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button