health tips in telugu
Pomegranate: ఒక్క దానిమ్మతో అనేక రోగాలకు చెక్..
ఎర్రటి గింజలతో చూడగానే నోరూరించే దానిమ్మ కాయ తెలియని వారెవరుంటారు చెప్పండి. అయితే ఈ దానిమ్మలో దాగున్న ఔషద గుణాల గురించి కూడా తెలుసుకోండి..
దానిమ్మలో విటమిన్ ఏ, సీ, ఇ, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వృద్దాప్య ఛాయలు రాకుండా శరీరాన్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి.

రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. కప్పు దానిమ్మ రసం తాగడం వలన గుండెకు ఎటువంటి ముప్పు ఉండదు.
లైంగిక సామర్థ్యానికి దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దానిమ్మకు ఉంది.
దానిమ్మరసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గిస్తాయి.
దానిమ్మ తొక్క గాయాలకు ఔషదంగా పనిచేస్తుంది.