Grapes: ద్రాక్ష వలన ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు
అందని ద్రాక్ష పుల్లన అంటారు కానీ.. ఆ ద్రాక్షను అందిపుచ్చుకుంటే అనేక పోషకాలను పొందవచ్చని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కెతో పాటు కాల్షియం, ఐరన్ లభిస్తాయి.
మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్ష ఒక చక్కని ఔషదంగా పనిచేస్తుంది. రోజూ కొన్ని ద్రాక్ష పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ తగ్గడానికి ఎంతగానో అవకాశం ఉంది.

ద్రాక్ష గుండెకు బలాన్ని ఇస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి, అలసట, గుండెదడ వంటి సమస్యలను నివారిస్తుంది.
ద్రాక్షలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి నిగారింపును తీసుకోస్తాయి.
ద్రాక్ష కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. పైత్యరసం సరిగ్గా తయారు కావడంలో ఉపయోగపడుతుంది.
అజీర్తి సమస్యలను తగ్గించి, మంచి అరుగుదల గుణాన్ని పెంచుతుంది.