health tips in telugu
Papaya: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో మీరూ తెలుసుకోండి..
Health Benefits of Eating Papaya: చిన్నా పెద్దా వయసుతో తేడా లేకుండా అందరూ తినే పండ్లలో బొప్పాయి పండు ఒకటి. బొప్పాయిలో ఉండే పోషక విలువలు మరే పండులోనూ ఉండవని వైద్యులు చెబుతుంటారు. తరచూ బొప్పాయిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సీ వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రక్త వృద్ధికి, రోగనిరోధక శక్తికి కూడా తోడ్పడుతుంది.

ఉదరానికి సంబంధించిన సమస్యలను మటుమాయం చేయడంలో బొప్పాయి సమృద్ధిగా పనిచేస్తుంది.
బొప్పాయిలో ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.
సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.