ఇలా చేస్తే చర్మంపై మచ్చలు అలా మాయమవుతాయి..
మనలో చాలా మంది క్యాబేజీని తినడానికి ఇష్టపడరు. దాని నుంచి వచ్చే వాసన కొందరికి నచ్చదు. అయితే నిజానికి క్యాబేజీ మనకు చేసే మేలు అంతాఇంతా కాదు. దాన్ని తినడం లేదంటే ఎన్నో పోషకాలను మనం కోల్పోతున్నట్లే అని తెలుసుకోవాలి. అయితే క్యాబేజీని తినడం ఇష్టంలేకపోతే కనీసం దానిని నీటిలో ఉడకబెట్టుకొని రోజూ ఆ నీటిని తాగినా చాలు. దాంతో మనకు అనేక ఉపయోగాలున్నాయి. అవేంటో చూస్తే..
క్యాబేజీ నీటిని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
దృష్టి సమస్యల పోతాయి. కంటి చూపు మెరుగవుతుంది. సైట్ ఉన్నవారు రోజూ క్యాబేజి నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజి నీటిని తరచూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతంది. అంతేగాక చర్మంపైన ఉన్న మచ్చలు కూడా పోతాయి.
క్యాబేజీలో ఉండే క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు ఎముకలకు బలాన్నిస్తాయి. దీంతో ఎముకలు ధృడంగా మారతాయి.
ఆల్కహాల్ సేవించే వారిలో లివర్ శుభ్రపడుతంది. శరీరంలోని వ్యర్థాలను కూడా బయటకు పంపించేస్తుంది.
అల్సర్‌తో బాధపడేవారు రోజూ క్యాబేజి నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.