AlluArjun to tieup with Boyapati Sreenu again : అల్లుఅర్జున్ బోయపాటి మరల కలవనున్నారు:-

AlluArjun to tieup with Boyapati Sreenu again : మెగా ఫామిలీ లో మోస్ట్ బిజీ గా ఉన్న హీరోలలో టాప్ 3 ప్లేస్ అల్లుఅర్జున్ కె దక్కుతుంది. వరుస సినిమాలతో ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 కోసం చాల కష్టాలు పడుతున్నారు.
కొత్త పోస్టర్స్ లో బన్నీ ఊరమస్ లుక్ చుస్తే అర్ధం అవుతుంది బన్నీ ఆ పాత్రా కోసం ఎంత కష్టపడుతున్నాడో. పుష్ప పార్ట్ 1 క్రిస్మస్ కి విడుదలకు సిద్ధం అవుతుంది.
అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఇదివరకే కమిట్ అయినా ఐకాన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వం వచించగా దిల్ రాజు నిర్మించనున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే బోయపాటి శ్రీను బన్నీ ని కలిసి డిఫరెంట్ మాస్ స్టోరీ చెప్పారని, ఆ కథ బన్నీ కి విపరీతంగా నచ్చిందని చిత్రసీమలో టాక్ నడుస్తుంది.
బన్నీ , బోయపాటి కలిసి ఇదివరకే సరైనోడు తో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన విషయం అందరికి తెలిసిందే. ఇపుడు ఈ కాంబినేషన్ రెండవ సారి కలవబోతున్నారని తెలియగానే అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది.
అయితే బన్నీ ఐకాన్ మరియు బోయపాటి సినిమా ఒకేసారి షూట్ చేయాలనీ నిర్ణయించుకున్నారని అర్ధం అవుతుంది. వచ్చే ఏడాది పుష్ప పార్ట్ 2 విడుదల అయ్యాక , బన్నీ ఐకాన్ కి మరియు బోయపాటి సినిమా కి ఎక్కడ కాల్ షీట్స్ అడ్డురాకుండా ఉండడానికి ఇప్పటినుంచే ప్రీ ప్లాన్ చేసారని తెలుస్తుంది.
అటు బోయపాటి శ్రీను కూడా అఖండ తర్వాత బన్నీ తోనే సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారని అర్ధం అయింది. చూడాలి మరి రెండవ సారి కలవనున్న ఈ కాంబినేషన్ ఇంకెన్ని కొత్త రికార్డ్స్ కి నాంది పలకబోతునారో.