అల్లుఅర్జున్ ని కలవడానికి ఓ అభిమాని…!

alluarjun:: సినీ హీరోలకోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. ఒక్కోసారి ప్రాణాలుకూడా లెక్కచేయరు. ఇలాంటి అభిమానులు ఉండడం సాదారనమే అయినా, హీరోలు మాత్రం అభిమానులను కలవడం చాల అరుదుగా జరుగుతూ ఉంటుంది.
అభిమానులు హీరోలను కలవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇలాంటిదే జరిగింది అల్లుఅర్జున్ విషయం లో, మాచర్లకు చెందిన ఒక అభిమాని బ్యానర్ కట్టుకొని హైదరాబాద్ కి 200 కి.మీ. నదవడం ద్వారా ఈ విషయం షోషల్ మీడియాలో వైరల్ ఐ అల్లుఅర్జున్ కి చేరుతుందని అనుకోని, తన నడకని మాచర్ల నుండి హైదరాబాద్ కి పాదయాత్ర మొదలు పెట్టాడు.
అభిమాని అనుకున్నట్టే టీవీ,షోషల్ మీడియా ద్వారా అల్లు కి తెలవడం తో ఆ అభిమానిని అల్లుఅర్జున్ సాదరంగా ఆహ్వానించాడు.
అల్లుఅర్జున్ ఆ అభిమానికి మొక్కను బహుమతిగా అందజేశాడు. తనని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ, సెక్యూరిటీ కలవనిచ్చేవారు కాదని అందుకే ఇలా చేయాల్సివచ్చిందని, మిమ్మల్ని కలవడం వల్ల నా కోరిక తీరిందని అభిమాని తెలిపాడు.