Allu Arjun vs Vishwak Sen : అల్లు అర్జున్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన విశ్వక్సేన్..!
Allu Arjun vs Vishwak Sen : ఇటీవల విడుదలైన బేబీ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మెయిన్ రోల్ లో నటించాడు. అదే విధంగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ బస్తి యువకుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో కూడా అతని పేరు ఆనంద్.. ఆ యువకుడు తన ఎదురింటి అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) ని ఇష్టపడతాడు. అమెకు కూడా ఆ యువకుడు అంటే ఇష్టం.. వీరి ప్రేమ స్కూల్ డేస్ లో స్టార్ట్ అయ్యింది. కానీ ఆనంద్ టెన్త్ క్లాసులో ఫీల్ అవ్వడంతో ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పాసై బీటెక్ లో చేరుతుంది. బీటెక్ కాలేజీలో ఒక ధనవంతుడు కొడుకు విరాజ్ తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. ఆ ఫ్రెండ్ షిప్ కాస్త డేటింగ్ దాకా వెళ్తుంది. అయితే ఈ విషయం ఆనంద్ కి తెలుస్తదా? తెలిస్తే అతను ఎలా స్పందిస్తాడు? వాళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందా? అనేది కథ ముఖ్య ఉద్దేశం. ఈ తరం యువత ఒకరిని లవ్ చేసి మరొకరితో రిలేషన్స్ షిప్ పెట్టుకొని జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో తెలియజేయడమే ఈ సినిమా కాన్సెప్ట్.. సినిమాలో ఇంటర్వ్యూ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ సినిమా యూత్ కి మాత్రం కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఆనంద్దే వరకొండ ఆటో డ్రైవర్ గా ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే వైష్ణవి ఇది మొదటి చిత్రమే అయినా… నటనలో మంచి వేరియేషన్స్ పెట్టింది. ఈ సినిమాకి బలం మ్యూజిక్ అని చెప్పాలి.

మొదట ఈ బేబీ కథని మాస్ కా దాస్ విశ్వక్సేన్ కి డైరెక్టర్ చెప్పగా..అది ఆయనకు నచ్చకపోవడంతో.. దాన్ని రిజెక్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన కొందరు సోషల్ మీడియాలో విశ్వక్సేన్ ని ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ విశ్వక్సేన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. బేబీ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ… డైరెక్టర్ మొదట ఒక అతనికి కథ చెప్తే.. ఆ కథ వేస్ట్.. ఇంకా ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడట అన్ని విశ్వక్సేన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ పై తాజాగా విశ్వక్సేన్ స్పందించాడు. మేము బిజీగా ఉంటాము.. మేము అంత పెద్ద కాకపోయినా.. ఎంత చిన్న హీరో కాకపోయినా.. కొన్ని సందర్భంగా బిజీగా ఉంటాం.. అలాంటి సందర్భాలో ఏం చేయాలో అర్థం కాక.. వాళ్ల టైం వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో కొన్ని కథలు రిజెక్ట్ చేస్తాం. దానికి కూడా కొందరు ఫీలవుతారు అంటూ విశ్వక్సేన్ ఉంచారు. ప్రస్తుతం అల్లు అర్జున్ విశ్వక్సేన్ వర్డ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి.