పెళ్లిరోజు సందర్బంగా ప్రేమకు చిహ్నమైన తజ్ మహల్ ని సందర్శించిన టాలీవుడ్ స్టార్… !

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి లు సడెన్ గా తజ్ మహల్ దగ్గర తళుక్కుమని మెరిశారు.
మరి వీరు అక్కడికి ఎందుకు వెళ్లాలనుకున్నారా .. వీరు 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం జరిగి అప్పుడే పదేళ్లు పూర్తయిపోయాయి. వీరి టెన్త్ యానివర్సరీని జరుపుకోడానికి ఆగ్రా చేరుకొని అక్కడే వారి తీపి గుర్తులను నెమరువేసుకుంటూ.. యానివర్శిని జరుపుకున్నారు. తరువాత ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించి , సందడి చేసారు. ఇపుడు ఈ ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ జంట దిగిన ఫోటోలు చుసిన నేటి జనాలు వైట్ తజ్ మహల్ ముందు , వైట్ డ్రెస్ వేసుకొని చాల క్యూట్ గా ఉన్నారంటూ… ఇంకా ఇలాంటి మరెన్నో యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇపుడు అల్లు అర్జున్ సినిమా విషయానికి వస్తే .. అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే.. ఈ సినిమా దాదాపుగా చివరి దశకు చేరుకుంటుంది. అలాగే ఈ మూవీని ఆగస్టు 13న రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.