Tollywood news in telugu

Allu Arjun: పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్..

Allu Arjun/Instagram

Allu Arjun: గతేడాది అల వైకుంఠపురం చిత్రం భారీ విజయం సాధించడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..
తదుపరి సినిమా పుష్ప తో బిజీగా ఉన్నాడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Allu Arjun/Instagram

తాజాగా ఈ పుష్పా సినిమా విడుదల తేదీని స్టైలిష్ స్టార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో స్టైలిష్ స్టార్ అభిమానుల ఆనందాలకు అవధులే లేవు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలిసిందే. అల్లు అర్జున్ కి జోడిగా హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్ వారు తెరకెక్కించగా.. నవీన్ రవి శంకర్ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button