Allu Arjun : హీరో అల్లు అర్జున్ ఇంట్లో పూజలు… పుష్ప-2 సినిమా భయంతోనేనా?
Allu Arjun : అల్లు అర్జున్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితం.. కానీ నేడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. పుష్ప సినిమాలోని పాటలకు సెలబ్రిటీలు క్రికెటర్లు కూడా డాన్స్ చేశారంటే బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. వాస్తవానికి అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకి ముందే తమిళ్ కన్నడలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలో నార్త్ సౌత్ అని తేడా లేకుండా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అదేవిధంగా పుష్ప పార్ట్ 2 సినిమా కోసం బన్నీ అభిమానులు చాలా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో ఓ పాటకి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటెలని చిందు వెయ్యబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా అల్లు వారి కుటుంబానికి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనముగా మారింది. మనం సామాన్యంగా నిత్యజీవితంలో జ్యోతిష్యాన్ని నమ్మే సెలబ్రిటీలు చూస్తూ ఉంటాం… ఏమైనా దోషాలు ఉంటే పూజలు హోమాలు చేస్తూ ఉండడం చూస్తున్నాం.. అదేవిధంగా అల్లు అర్జున్ కి కూడా ఒక దోషం ఉందని.. అందుకే బన్నీ పరిహార పూజలు చేస్తున్నాడని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ పూజ చేయకపోతే బన్నీ సినిమాల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. అల్లు వారి కుటుంబం స్పందించేదాకా మనం వేచి చూడాల్సిందే…