Tollywood news in telugu

మహేష్ బాబు AMB సినిమాస్ కు దీటుగా , అల్లు అర్జున్ AAA రెడీ అవుతుంది…!

Allu Arjun - Mahesh Babu

Allu Arjun – Mahesh Babu: టాలీవుడ్ లోని హీరోలు తెలుగు సినిమాలపై ఏ రూట్లోనైనా డబ్బులు పెట్టడానికి రెడీ అవుతున్నారు.  అవి సినిమా నిర్మాణం కానీ, మూవీ థియేటర్లు బిల్డ్ చేయడం మరియు ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ ని ఏర్పరచుకోవడం కావచ్చు ,ఇలా ప్రతీ దాంట్లో దూసుకుపోతున్నారు. ప్రత్యేకించి మన హీరోలు ఇప్పుడు థియేటర్ బిజినెస్‌పై బాగా ద్రుష్టి పెడుతున్నారు.

హీరోలు ఎక్కడ ఎక్కువగా సంపాదిస్తున్నారో, అక్కడే  పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే  హీరో  మహేష్ బాబు థియేటర్ బిజినెస్‌లో తన సత్తా చాటుతున్నాడు. మహేష్  ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్టెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. AMB సినిమాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా మారింది. ఇక మరో హీరో  విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్‌నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. AVD సినిమాస్ పేరుతో తన సొంత జిల్లా  మహబూబ్‌నగర్‌లో ప్రారంభించబోతున్నాడు. 

ఇప్పటికే ప్రభాస్, వెంకటేష్ లాంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లు స్టార్ట్ చేసారు.  ప్రభాస్‌ నెల్లూరులో మల్టీప్లెక్స్ ఓపెన్ చేసాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ రంగంలోకి అడుగు వేస్తున్నాడు. అల్లు కూడా  ఏషియన్ సినిమాస్‌తో కలిసి AAA సినిమాస్ ను ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్  నిర్మాణ పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక  త్వరలో AAA  సినిమాస్  అభిమానులకోసం రెడీ కాబోతుంది.   అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టీప్లెక్స్ ఉండనుందని తెలుస్తుంది.  అమీర్‌పేట్ పరిసరాల్లో AAA   విలాసవంతమైన భవంతిని నిర్మిస్తున్నారు.  అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్లుగానే ఈ AAA సినిమాస్ ఉండనుంది అని తెలుస్తుంది.  దీనికోసం భారీ బడ్జెట్  ఖర్చు పెడుతున్నాడు అల్లు అర్జున్. మహేష్ బాబు AMB సినిమాస్ కి దీటుగా AAA  ఉందనుడట.  ప్రస్తుతం అల్లు అర్జున్  సుకుమార్ ‘పుష్ప’  మూవీలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button