Tollywood news in telugu

Allu Arjun: “నేను బూతులు తక్కువగా మాట్లాడుతున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్

అగ్ర ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్య తో పెళ్లి అయిన తర్వాత సినిమాల జోరు తగ్గించింది. కానీ ప్రేక్షకులను అందం, అభినయం ముద్దు ముద్దు మాటలతో వైవిధ్యంగా అలరించేందుకు సమంత పలు షోలలో పోస్ట్ గా వ్యవహరిస్తుంది, మొదట అక్కినేని నాగార్జున హిమాలయాల్లో వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉండడంతో బిగ్ బాస్ హోస్ట్ గా రెండు రోజులు సమంత అద్భుతంగా వ్యవహరించింది. అదేవిధంగా ఆహా ఓటీటీలో ప్రసారమౌతున్న సామ్ జామ్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తనదైన శైలిలో ప్రముఖ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ తమన్నా సామ్ జామ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఈ మేరకు తాజాగా సామ్ జామ్ షో కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో ని యూట్యూబ్ లో విడుదల చేశారు. మొదట ఈ ప్రోమోలో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ సమంతా తో ఫోన్లో మాట్లాడుతాతు..” వాళ్ళ డాడీ ని ఒక క్వశ్చన్ అడుగుమని” సమంతా ని కోరుతాడు. దానికి సమంత ఓకే అని చెపుతుంది. ఆ క్వశ్చన్ ఏంటో ప్రోమో లో చూపెట్టలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ సామ్ జామ్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు… సమంత ” మీరు తండ్రి అయిన తర్వాత మీలో ఏమైనా చేంజెస్ నోటీస్ చేశారా?” అనే క్వశ్చన్ అడగగా.. తాను తండ్రి అయ్యాక అయ్యాక కొంచెం బూతులు మాట్లాడటం తగ్గించానన్ని సరదాగా అల్లు అర్జున్ సమాధానమిస్తాడు. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ లో ఒక సంఘటన జరిగింది… ఆ సంఘటనే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అని అల్లు అర్జున్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా సామ్ జామ్ షో లో పాలు పంచుకుంటాడు.
ఈయన కూడా అల్లు అర్జున్ పై సరదాగా పంచులు వేశాడు. దీంతో ఈ ప్రో విడుదల అయిన కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read  She Taxi Applications: షీ ట్యాక్సీలు పొందాలనుకుంటున్నారా... ఐతే ఇలా దరఖాస్తుకు చేయండి...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button