Tollywood news in telugu
సంక్రాంతికి విడుదలకానున్న’బంగారు బుల్లోడు’ చిత్రం !

అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ సినిమాతో మల్లి ఇన్నాళ్లకు ఎంట్రీ ఇవ్వనున్నాడు. `అల్లరి` సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి నరేష్ తనదైన శైలిలో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. గతంలో వరుస గా సినిమాలు చేసినప్పటికీ నరేష్ కి హీరోగా సరైన హిట్ లేక ఇప్పటి హీరోలతో పోటీపడలేకపోయాడు.
ఇపుడు `బంగారు బుల్లోడు` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించగా , పి.వి.గిరి దర్శకత్వం వహిచడు. అదేవిదంగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా ఝవేరి నటించింది.
ఇప్పటికే ‘బంగారు బుల్లోడు’ టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందింది.