All set for Jayamma Panchayati : పంచాయితీ నడిపించేందుకు సిద్ధం అయినా జయమ్మ :-

All set for Jayamma Panchayati : ఏంటి హెడ్డింగ్ చదవగానే ఏవేవో ఊహించుకోవటం మొదలెట్టేశారా ? కంగారు పడకండి మేము చెప్పేస్తాము. గత వారం రోజులుగా సోషల్ మీడియా లో ఎన్నో విధాలుగా చక్కర్లు కొడుతున్న విషయమే మనందరికీ తెలుసు.
అదేంటో కాదు స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ కి ఎంట్రీ ఇయ్యబోతున్న పవర్ ఫుల్ యాంకర్ సుమ కనకాల. ఇప్పటికి మీకు మ్యాటర్ అర్ధం అయ్యింటది. సుమ కనకాల బిగ్ స్క్రీన్ ఎంట్రీ కి సర్వం సిద్ధం చేసారు. ఇది ఓకే మరి హెడ్డింగ్ సంగతి ఏంటి అని అంటారా.
మ్యాటర్ లోకి వెళ్తే సుమ కనకాల చెయ్యబోయే మొదటి సినిమా పేరు జయమ్మ పంచాయితీ. ఈ సినిమాలో సుమ జయమ్మగా గ్రామంలో పంచాయతీ చేసేవారిలా చుపియబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని విజయ్ కుమార్ దర్శకత్వం వహించగా , బలగాప్రకాష్ గారు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు.
కాసేపటి క్రితమే మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతులు మీద విడుదలైన మోషన్ పోస్టర్ అని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా చేయడం తో సినిమా మీద అంచనాలు భారీ లెవెల్ లో పెరిగిపోయాయి.
శేరవెగంగ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదల తేదీ ప్రకటించి గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి మరి సుమ బిగ్ స్క్రీన్ లో ఏ రేంజ్ హుంగామ చేయబోతుందో , జయమ్మ గా ఎలాంటి పంచాయితీ నడపబోతుందో వేచి చూడక తప్పదు.