Tollywood news in telugu

All Set for Grandeur Launch of RRR Teaser : ఆర్.ఆర్.ఆర్ టీజర్ కు సర్వం సిద్ధం :-

All Set for Grandeur Launch of RRR Teaser

All Set for Grandeur Launch of RRR Teaser : దేశవ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి జక్కన దర్శకత్వం లో చేసిన ప్యాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్. అయితే ఈ సినిమా ఎన్నో కష్టాలు ఎదుర్కొని , వాయిదాల మీద వాయిదాలు చేసుకుంటూ చివరికి జనవరి 7 న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

కాకపోతే ఇన్నిరోజులు కాదు కాదు ఇన్ని నెలలు , సంవత్సరాలుగా అభిమానులు మరియు సగటు ప్రేక్షకుడు ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి మూడంటే ముందే వీడియోలు చూడటం జరిగింది. ఒక్కటి భీం ఫర్ రామరాజు , మరొకటి రామరాజు ఫర్ భీం ఇక చివరిగా ఆర్.ఆర్.ఆర్ లోని అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో. ఈ మూడు తప్ప ఇంకా ఏది ఇన్ని నెలలుగా విడుదల చేయలేదు చిత్రబృందం.

అయితే ఇప్పుడు కచ్చితంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా జనవరి 7 న రాబోతుంది అని తెలిపారు , ఇక పోస్ట్ పోన్ చేయడాలు ఉండవ్ అని చెప్పేందుకే ఆర్.ఆర్.ఆర్ టీజర్ విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసారు చిత్రబృందం. మొత్తానికి అక్టోబర్ 29 న థియేటర్లలో మరియు అధికారిక యూట్యూబ్ చానెల్స్ లో ఆర్.ఆర్.ఆర్ టీజర్ ఘనంగా విడుదల కాబోతుంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ టీజర్ 40 సెకండ్ల నిడివితో ఉండబోతుందని , టీజర్ లో ఒక డైలాగు కూడా ఉండబోదు అని , అన్ని భాషలకి కలిపి ఒకే వీడియో రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. టీజర్ లో డైలోగ్స్ లేకపోతే ఇతరభాషలో డబ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబ్బటి ఇలా కొత్తగా ప్లాన్ చేసారు చిత్రబృందం.

ఈ 40 సెకండ్ల టీజర్ లో ఎన్టీఆర్ , చరణ్ , అజయ్ దేవగన్ , అలియా భట్ , శ్రేయ ఇలా సినిమాలో ఉన్న అన్ని పాత్రలు

మధ్య సాగె హై యాక్షన్ ప్యాకెడ్ టీజర్ అని చెప్పకనే చెప్తున్నారు. చూడాలి మరి రేపు విడుదల అవ్వబోతున్న ఈ టీజర్ ద్వారా సినిమా మీద హైప్ ఇంకెంత పెరుగుతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button