Tollywood news in telugu
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ ఐన అలియా బట్ !

ఆర్ఆర్ఆర్ మూవీలో బాలీవుడ్ అందాల మెరుపుతీగ ఆలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆలియా వచ్చేసింది. దీనికి సంబంధించి అలియా తన ఇన్‌స్టాగ్రామ్ ఒక ఫొటో షేర్ చేసింది.
కరోనా లాక్‌డౌన్ తో ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆర్ఆర్ఆర్ షూట్‌లో ఆలియా కాస్త లేటుగా చేరుకుంది . ఇకనుండి ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి పనిచేయబోతున్నానని ఆలియా ఫొటో షేర్ చేయడంతో తన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమాతో తెలుగులో ఆలియా మొదటిసారి పరిచయం కాబోతుంది. ఈ మధ్యనే మహాబలేశ్వర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కు సంబదించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ముగించుకొని టీమ్ హైదరాబాద్ చేరుకొని ఇక్కడ మరికొన్ని సన్నివేశాలను అలియాభట్ తో చేయనుంది .