Tollywood news in telugu
అప్పట్లో పిల్లి ఇప్పుడు కుక్క మాంసం
అప్పట్లోనే పిల్లి మాంసం . . ఇప్పుడు కుక్క మాంసం.
ఒకప్పుడు చెన్నై లో పిల్లి మాంసం తో చేసిన బిర్యానీని మటన్ బిర్యానీ,చికెన్ బిర్యాని గా అమ్మిన విషయం సంచలనం రేపింది.తాజాగా సోషల్ మీడియా లో గత కొన్ని రోజులుగా చెన్నై రెస్టారెంట్స్ , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుక్క మాంసం వంటకాలు అమ్ముతున్నారు అంటు వదంతులు వ్యాపించాయి. అయితే ఆ వదంతులను నిజం చేసింది ఈ ఘటన.
తాజాగా ముందస్తు సమాచారము మేరకు చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో జోధ్ పూర్ నుండి వస్తున్న థర్మాకోల్ బాక్సుల్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేయగా ఐస్ ముక్కల మధ్య ఉంచిన తోలు తీసిన కుక్క మాంసం దొరికింది. చెన్నై లోకల్ ఫుడ్ స్టాల్స్ కి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.తమిళ నాడు పోలీసులు విచారణ దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు.