Tollywood news in telugu

Alanti Sitralu Teaser : ‘నాశనమవ్వాలంటే అన్నీ సహకరిస్తాయ్’ అనే ఆలోచింపచేసే డైలాగ్ తో ‘అలాంటి సిత్రాలు’.. టీజర్… !

Alanti Sitralu Teaser

Alanti Sitralu Teaser  : ప్రముఖ దర్శకుడు  పూరి జగన్నాధ్ వద్ద  రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సుప్రీత్ , సి. కృష్ణ దర్శకత్వంలో  ‘అలాంటి సిత్రాలు’ రూపొందుతుంది. ఈ సినిమాకు  రాహుల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ యొక్క  టీజ‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తన చేతులమీదుగా రిలీజ్ చేశారు. ఒక డిఫ్ఫరెంట్ కథాంశం తో ఈ మూవీ  టీజ‌ర్ కనబడుతుంది అని , అలాగే టీజర్ చూస్తున్నంతసేపు అందులోని సీన్స్ కట్టిపడేస్తున్నాయని, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల మనసు దోచి మంచి విజయాన్ని సాదిస్తుందని దిల్ రాజు వెల్లడించారు.

విభిన్న మనస్తత్వం కలిగిన నలుగురు  వ్య‌క్తులు ఒక్క దగ్గర కలిసినపుడు, వారి జీవితాల్లో ఎదురయ్యే  అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అలాంటి సిత్రాలు’. ఈ టీజ‌ర్‌లో, “ఒక‌టి గుర్తు పెట్టుకో నాశ‌న‌మవ్వాలంటే అన్నీ స‌హ‌క‌రిస్తాయ్‌. కానీ బాగు ప‌డాలంటేనే వంద అడ్డంకులొస్తాయ్.” అంటూ ముఖ్యమైన రోల్ చేస్తున్న  ప్ర‌వీణ్ యండ‌మూరి చెప్పిన డైలాగ్ అందరిని ఆలోచనలో పడేస్తుంది. ఈ మూవీలో  అజ‌య్ క‌తుర్వార్‌, శ్వేతా ప‌రాశ‌ర్‌, యష్ పురి ముఖ్య  పాత్ర‌లలో నటించారు.

ఈ టీజర్ లో  శ్వేతా ప‌రాశ‌ర్ ఒక వేశ్య పాత్ర‌ను చేస్తునట్టు తెలుస్తుంది. ఈ సినిమా క‌థ పరంగా శ్వేత పోషించిన పాత్ర కీల‌కమైనదని స్పష్టమవుతుంది. అలాగే  బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ, తో  టీజ‌ర్ రిచ్ లుక్ను సంతరించుకుంది. అందరి ప‌ర్ఫార్మెన్స్‌ల‌ను చూస్తూ ఉంటె ఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని తెచ్చుకోనుందని తెలుస్తుంది.

అలాగే మొత్తానికి  టీజ‌ర్‌ను చూశాక సినిమాను చూడాల‌నే ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కరిలో  కలుగుతుంది. త్వ‌ర‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button