Ala Vaikunthapurramuloo 2nd single Ramuloo Ramulaa, The Most Viewed South Indian Song in 24 hours !!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట రికార్డులను తిరగరాస్తోంది.
అల వైకుంఠపురములోని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచి
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)