Tollywood news in telugu

అంగరంగ వైభవంగా అల వైకుంఠపురంలో మ్యూజికల్ నైట్, బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ ఇన్ సౌత్ ఇండియా !!!


*అంగరంగ వైభవంగా అల వైకుంఠపురంలో మ్యూజికల్ నైట్, బిగ్గెస్ట్ మ్యూజికల్ నైట్ ఇన్ సౌత్ ఇండియా !!!*

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో “అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ” వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నారు.

ఈ ఈవెంట్ ను శ్రేయస్ మీడియా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. 52 అడుగు పొడవు, 162 అడుగుల వెడల్పు తో స్టేజి డెకరేట్ చేయనున్నారు. సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వెయ్యడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఫంక్షన్ లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, ఆర్మన్ మాలిక్, రాహుల్ సిప్లిగoజ్, రోల్ రైడ, లేడి కాశ్, రాహుల్ నంబియర్, అనురాగ్ కులకర్ణి, ప్రియ సిస్టర్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే ఎమ్.జె5 డాన్స్ , ఇండియన్ రాగా వారు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.

Read  mimi 2021 - సినిమా :- మిమి (2021)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button