Tollywood news in telugu
సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12 -2020 న విడుదల !!!

సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురంలో’ జనవరి 12 -2020 న విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
‘అల వైకుంఠపురంలో’ ని విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’, దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం, వీటికి ముందు చిత్రం పేరును వీడియో రూపంలో విడుదల చేసిన తీరు ప్రశంసలందుకుంది. చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా అవి చేశాయన్నది ప్రేక్షకాభిమానులు మాట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్,త్రివిక్రమ్ …. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ..ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పాత చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను, విశేషాలను వరుసగా తెలియపరుస్తాము.
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచి న్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాం త్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,కల్యాణి నటరాజన్,రోహిణి,ఈశ్వరీ రావు,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ ధన్,అజయ్,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)