Tollywood news in telugu

akshara movie review : అక్షర మూవీ రివ్యూ … ఎవరికి కనెక్ట్ అవుతుదంటే..!

akshara movie review

నిర్మాత: అల్లూరి సురేష్ వర్మ

దర్శకుడు: చిన్ని కృష్ణ

బ్యానర్: సినిమా హాల్ ఎంటర్టైన్ మెంట్

తారాగణం: నందిత శ్వేతా , సంజయ్ స్వరూప్, షకలక శంకర్, సత్య, మధునందన్, హర్షవర్ధన్, అజయ్, ఘోష్, తదితరులు… నటించారు.

 నందిత శ్వేత ప్రధాన పాత్రలో, షకలక శంకర్, సత్య, మధులు నటించిన సినిమా ‘అక్షర’. విద్యారంగంలో ఉన్న ఒడిదొడుకులు , అందులో జరుగుతున్న  క్రైమ్ అంశాలను ఆధారంగా తీసుకొని సినిమా ఉండనుంది. ట్రైలర్ తో తెలంగాణ సీఎం కుమార్తె కవిత,మన్నలను కూడా పొందింది.

ఇక కథ విషయానికి వస్తే…

విద్య విధాన్ విద్య సంస్థల అధినేత ఐన సంజయ్ భార్గవ్(సంజయ్ స్వరూప్) ఎడ్యుకేషన్ అంటే ఎంతటివారైనా సరే, వీరి సంస్థ వైపే చూడాలని, భార్గవ్ టార్గెట్.

 అందులో భాగంగా ర్యాంకులు కోసం విద్యార్థులను చదువుపేరుతో హింసించడం, స్ట్రెస్ కి గురిచేయడం , ఆ ఒత్తిడికి విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. అదే సమయంలో ‘విద్య విధాన్ కాలేజ్’ లో ఫిజిక్స్ లెక్చరర్ గా అక్షర(నందిత శ్వేత) జాయిన్ అవుతుంది. అదే  కాలేజ్ లో బోర్డు మెంబర్ అయిన శ్రీతేజ (శ్రీతేజ) , అక్షర చేసే పనుల చూసి  తనపై ఇంట్రెస్ట్ గా ద్రుష్టి పెడుతుంది. ఇదిలా ఉంటె…  అక్షర ఉంటున్న కాలనీలో , షకలక శంకర్, సత్య, మధు లు అక్షరని ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమిస్తారు.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

అనుకోకుండా ఒక రోజు శ్రీతేజ, అక్షరకి ప్రపోజ్ చేసే టైంలో, అక్షర శ్రీతేజని రివాల్వర్ తో కాల్చేస్తుంది. ఈ  సంఘటన చూసిన షకలక శంకర్, సత్య, మధులు పారిపోతారు. ఇక అప్పటి  నుంచి అక్షర ఎవరు?  శ్రీతేజను ఎందుకు  చంపింది? అక్షర కథ ఏంటి? ఎవర్ని టార్గెట్ చేసి  విద్య విధాన్ కాలేజ్ లో జాయిన్  ఐంది?  షకలక శంకర్, సత్య, మధులు ఏం అయ్యారు ?  అన్నదే కథ.

ఇక నటీనటులు ఎలా చేసారు అనే విషయానికి వెళ్తే…

నందిత శ్వేత నటన అందరిని అలరించింది. అటు  ట్రెడిషనల్ లుక్ లో ప్రేక్షకులను అలరిస్తూ…  మరోవైపు డార్క్ షేడ్స్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. శ్రీతేజ ఉన్నంతలో బాగానే చేసాడని చెప్పాలి. ఇక  షకలక శంకర్, సత్య, మధుల నటన పరంగా న్యాయం చేసారు.  డైరెక్టర్ మాత్రం కమీడియన్స్ తో హాస్యాన్ని అనుకున్న విదంగా పండించలేదు.  నెగటివ్ షేడ్స్ లో సంజయ్ స్వరూప్ నటన అదిరిపోయింది. సినిమాలో  కీలక పాత్ర పోషించిన హర్ష వర్ధన్ కి ఇందులో ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు.  ఫ్లాష్ బ్యాక్ సినిమాకి బ్యాక్ బోన్ అయింది .

Read  అందాల అనసూయా....

బోరింగ్ ఎక్కడ ఉందంటే…

*   ఫస్ట్ హాఫ్బోరింగ్

*  ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడం

*  వీక్ క్లైమాక్స్

* ఆసక్తిలేని కథనం

*  స్లో నేరేషన్

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button