Tollywood news in telugu
అక్కినేని నాగార్జునకు అరుదైన గౌరవం దక్కింది !

టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున అరుదైన గౌరవం దక్కింది. భారత చిత్ర సీమ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద నెలకొల్పిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అక్కినేని నాగార్జునను వరించింది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి `మోస్ట్ వర్సటైల్ యాక్టర్` అవార్డు నాగ్ కి దక్కింది. ఈ అవార్డుల యొక్క జాబితాను తాజాగా విడుదల చేశారు.
తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ‘ఉత్తమ దర్శకుడు’గా సుజిత్ (సాహో), ‘ఉత్తమ చిత్రం’గా నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. అదేవిదనగా ‘ఉత్తమ నటుడు’గా నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ), ‘ఉత్తమ హీరోయిన్’గా రష్మిక (డియర్ కామ్రేడ్), ‘ఉత్తమ సంగీత దర్శకుడు’గా తమన్ ఎంపిక అయ్యారు.