Akkineni Akhil Vs Naga Shourya : అక్కినేని అఖిల్ Vs నాగ శౌర్య :-

Akkineni Akhil Vs Naga Shourya : ఇద్దరు టాలీవుడ్ హీరోలు , ఇద్దరికీ సక్సెస్ లేక చాల కాలం అయింది. ఒకరికి సక్సెస్ మొదటి సినిమా నుంచి పలకరించకపోతే , మరొకరికి సక్సెస్ వచ్చినట్లే వచ్చి మాయమయిపోయి ప్లాప్స్ ని చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది.
వారెవరో కాదు మొదటి సినిమా నుంచి సక్సెస్ కొట్టని హీరో అక్కినేని అఖిల్ , మొదటి సినిమా నుంచి సక్సెస్ కోసం ఎంత కష్టపడినా చివరికి నిరాశనే కలిగిస్తుంది. అలాంటి అఖిల్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బొమ్మరిల్లు భాస్కర్ గారితో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీశారు. ఈ సినిమా టీజర్ మరియు పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది.ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం అయింది. ఇదివరకే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా ఇంకో పక్క నాగ శౌర్య తీసిన సినిమాలలో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే సినిమాలు రెండే , ఒకటి ఊహలు గుసగుసలాడే మరియు ఛలో. ఈ రెండు సినిమాల తర్వాత కానీ ముందు కానీ శౌర్య దాదాపు 6 ప్లాప్స్ ముట్టకట్టుకున్నారు.
ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా ఫ్లోప్స్ లో నిండా మునిగిపోయారు. నర్తనశాల , అమ్మమ్మగారిల్లు , కణం , అశ్వద్ధామ. ఇలా వరుసగా ఫ్లోప్స్ రుచి చుసిన నాగ శౌర్య ఇపుడు సక్సెస్ కోసం కష్టపడి రెండు సినిమాలు తీశారు. అందులో ఒకటి వరుడు కావలెను. ఈ సినిమాలో రీతు వర్మ కథానాయకిగా కనిపిస్తుంది. ఈ సినిమా టీజర్ , పాటలు ప్రేక్షకులని విపరీతంగా నచ్చేశాయి. రిపీట్ మోడ్ లో పాటలు వింటున్నారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం అయింది.
ఇద్దరు ఫ్లోప్స్ లో ఉన్న హీరోలు వారి సక్సెస్ రుచి చూడటానికి ఒకేరోజు రావడం విశేషం. మొత్తానికి అఖిల్ మరియు నాగ శౌర్య కలిసి ఒకేరోజు వారి సినిమాలు థియేటర్ లో విడుదల చేసి సందడి చేయనున్నారు. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని ఏ రేంజ్ లో అరించబోతుందో.