Tollywood news in telugu

Akhanda Updates Mania Begins : ఇకనుంచి అఖండ అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి :-

Akhanda Updates Mania Begins

Akhanda Updates Mania Begins : బోయపాటి శ్రీను మరియు బాలయ్య బాబు ముచ్చటగా మూడవసారి కలిసి చేస్తున్న సినిమా అఖండ. వరుసగా సింహ , లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన కాంబినేషన్ కావడం తో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.

ఎపుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి దసరా కానుకగా విడుదలకు ముస్తాబయింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబందించిన మొదటి పాట ఈరోజు విడుదల అవ్వబోతుంది అన్న వార్త అభిమానులకు చాల ఆనందాన్ని కలిగించింది. ఇంకొంతమంది వారి ఆనందాన్ని ట్విట్టర్ లో చిత్ర బృందాన్ని ట్యాగ్ చేసి వ్యక్తం చేస్తున్నారు.

ఈరోజు సాయంత్రం 5:55 నిమిషాలకు విడుదల అవ్వున్న ఈ పాట కి సంబందించిన ప్రోమో వదిలారు. బాలకృష్ణ మరియు ప్రగ్య మధ్య సాగే ఈ లవ్ సాంగ్ టైటిల్ అడిగా అడిగా అని మొదలయింది.

ప్రోమో తోనే ఫీల్ గుడ్ పాట అని అందరికీ అర్థం అయింది. చూడాలి మరి పూర్తి సాంగ్ నీ తమన్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేయనున్నారో.

ఇక నుంచి ప్రతి వారం ఈ సినిమా కి సంబందించిన అప్ డేట్స్ అధికారికంగా వస్తూనే ఉంటాయని అనుకుంటున్నాం. చూడాలి మరి అఖండ ఏ రేంజ్ లో అలరించబోతున్నాడో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button