Akhanda Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Akhanda (2021) Review
నటీనటులు :- నందమూరి బాలకృష్ణ , ప్రగ్య జైశ్వాల్ , శ్రీకాంత్ , జగపతి బాబు , సుబ్బ రాజు, సాయి కుమార్ మొదలగు.
నిర్మాతలు :- మిర్యాల రవీంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు :- థమన్.యస్.యస్
డైరెక్టర్ :- బోయపాటి శ్రీను
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ ఫ్లాష్ బ్యాక్ లో స్వామిజి ఆదేశం మేరకు ఇద్దరు కవల పిల్లలని వేరు చేయడం తో మొదలవుతుంది. కట్ చేస్తే పోలీసులు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గజేంద్ర సాహు ని వెతికే ఆపరేషన్ చేయగా మురళి కృష్ణ ( బాలయ్య బాబు ) ఊర మాస్ ఎంట్రీ మరియు ఫైట్ తో ఉంటుంది. మురళి కృష్ణ అనంతపూర్ లో విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఇంకో పక్క అనంతపూర్ లోని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఏఎస్ గా స్రవణ్య ( ప్రగ్య జైస్వాల్ ) ఇంట్రో ఉంటుంది. మురళి కృష్ణ యొక్క క్యారెక్టర్ బాగుండటం తో స్రవణ్య ఇంప్రెస్స్ అయి ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే వరదరాజులు ( శ్రీకాంత్ ) గ్రీన్ జోన్ ఏరియాస్ లో ఇల్లీగల్ గా కాపర్ మైనింగ్ దందా చేస్తుంటాడు. కొని అనుకోని సంఘటనల చేత ఇప్పుడు మురళి కృష్ణ మరియు వరదరాజులు మధ్య ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు అఖండ ( రెండవ బాలకృష్ణ) ఎంట్రీ తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
ఇంతకీ మురళి కృష్ణ మరియు అఖండ ఎందుకు బాల్యం లోనే విడిపోవాల్సి వచ్చింది ? దీనికి గల కారణాలు ఏంటి ? మురళి కృష్ణ కి వరదరాజులు కి మధ్య గొడవ ఏంటి ? సడన్ గా అఖండ ఎందుకు వచ్చారు ? అఖండ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? అఖండ మరియు మురళి కృష్ణ ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత కలవాల్సి వచ్చింది ? వరదరాజులు ఎం చేయబోతున్నాడు ? చివరికి ఇద్దరు బాలకృష్ణలు కలిసి ఎం చేయబోతున్నారు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- బాలయ్య డబుల్ రోల్ మాస్ నీ రీ డిఫైస్ చేశారు. మురళి కృష్ణ గా మరియు అఘోర అఖండ గా ద్వీపాత్రలో అరాచకం సృష్టించారు. ప్రగ్య కూడా బానే చేసింది. శ్రీకాంత్ విలన్ కెరియర్ కి బూస్ట్ అప్ ఇచ్చే రోల్ చేశారు. మిగితా పాత్రధారులు వారివారి పాత్ర మేరకు న్యాయం చేశారు.
- దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యాన్స్ నీ గట్టిగా అలరించేశారు.
- యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా అలరిస్తుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
- దాదాపు 15 నిమిషాల సీన్స్ ఎడిట్ చేసేయచు.
Overall :-
మొత్తానికి అఖండ సినిమా ఫ్యాన్స్ కే కాదు మూవీ లవర్స్ కి కూడా విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే బాలయ్య బాబు తన మార్క్ నటనతో మరియు ద్వీపాత్రా లో అభిమానులను అలరించడమే కాదు ఎప్పటికీ మాస్ అంటే గుర్తుండిపోయేలా చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్.
సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. లెంగ్త్ ఎక్కువ అనే తప్ప ఎటువంటి నెగటివ్ పాయింట్స్ చెప్పడానికి లేదు. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా బోయపాటి మరియు బాలయ్య బాబు చేసిన ఊర మాస్ సినిమాని చూసేయచ్చు .
Rating :- 3.25 /5