Tollywood news in telugu
అంబాని కుటుంబం లోకి కొత్త కార్
ఇండియాలో అత్యధిక లగ్జరీ కార్లు ఉన్న ఫ్యామీలి అంబానీ కుటుంబం. ముఖేష్ అంబానీ ఫ్యామీలి వద్ద సుమారుగా 100కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. కోట్ల రుపాయలు విలువ చేసే ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నా… ఆ కుటుంబం ఇంకా సంతృప్తి చెందలేదు.ఖరీదైన కారును కొనుగోలు చేసిన అంబానీ ఫ్యామిలీ తమ సొంత అవసరాలకు కాకుండా, ఆకాశ్ అంబానీ కాబోయ్ భార్య శ్లోకా మెహ్తాకు నిశ్చితార్థం రోజున ఈ ఖరీదైన బెంట్లీ కారును కానుగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ పుకారును నిజం చేస్తూ శ్లోకా మెహ్తా నూతన బెంట్లీ ఎస్యూవీలో ప్రయాణిస్తూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కింది.ఆకాశ్ అంబానీ, ఆయన ఫియాన్సీ ఇద్దరూ బెంట్లీ ఎస్యూవీలను వినియోగిస్తున్నారు. భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార వేత్త కుమారుడు ఇలాంటి కార్లను కలిగి ఉండటం ఆయన స్థాయికి పెద్ద లెక్కేం కాదనుకోండి.