ఇదేం కానుక రా
సాధారణంగా పండగలకి హీరోలు, అభిమానులకు అభిమానులు, హీరోలకు కానుకలు ఇచ్చుకోవడం మనకు తెలిసిందే.అలాగే ఈసారి వచ్చిన సంక్రాంతి పండగకి అజిత్ విశ్వాసం మూవీతో అభిమానులకి మంచి బహుమతి ఇచ్చాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా చెన్నైలోని ఒక ప్రముఖ చాక్లెట్ కంపెనీ అజిత్ క్రేజ్ని దృష్టిలో ఉంచుకొని లక్షలు ఖర్చు చేసి విశ్వాసం లుక్ లో ఉన్న అజిత్ చాక్లెట్ ప్రతిమను తయారు చేసింది.ఇది దాదాపు 5.9 అడుగుల ఎత్తు 160 కేజీల బరువు ఉంది దీన్ని తయారు చేయడానికి 240 మంది పది రోజుల పాటు కష్టపడ్డారట.ఆ ప్రముఖ కేక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి పండక్కి వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకున్నట్లు అందుకే ఇలాంటి ప్రయోగం చేసినట్లు తెలిపారు.
అయితే అజిత్ చాక్లెట్ ప్రతిమ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండటంతో అభిమానులు షేరింగులు, లైకుల చేయడంలో బిజీగా ఉన్నారు.