నేనెప్పుడూ వైస్ కెప్టెన్ గానే ఉంటానంటూ రోహిత్ కి షాక్ ఇచ్చిన రహానే

ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో తాత్కాలిక కెప్టెన్ గా రహానే జట్టును ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. ఈ మేరకు రహానే తన నాయకత్వంలో భారత్ కు చారిత్రాత్మక విజయన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అజింక్య రహానే ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ ఆస్ట్రేలియా టెస్టు విజయం అనంతరం పలువురు రహానే ని టెస్ట్ ఫార్మేట్ కు కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీనిపై తాజాగా రహానే స్పందించారు. ఎప్పటికీ విరాట్ కోహ్లీ నే టెస్ట్ లకు కెప్టెన్ గా ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు వైస్ కెప్టెన్ గా ఉంటానని..విరాట్ లేనప్పుడు తాను పగ్గాలు అందుకుని జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

ఇప్పటికే ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో బీసీసీఐ రోహిత్ శర్మ ని కాదని రహానే కి వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది.
దీన్ని చూస్తే రోహిత్ ని బీసీ పక్కకు పెట్టిందని హిట్ మాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.