Tollywood news in telugu
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ కారును అడ్డుకున్న రైతులు…!

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ కి ఎప్పుడు ఎదురుకాని చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో దినోషీ ప్రాంతంలోని ఫిల్మ్ సిటీకి ఆయన కారులో బయలుదేరగా.. తన వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.
వారి నిరసన గురించి దేవ్ గన్ కి చెప్పగా… వారికీ అజయ్ దేవ్ గన్ మద్దతు ఇవ్వకపోవడంతో వారు ఆయనను ‘పంజాబీకా దుష్మన్’ అంటూ దూషించడం ప్రారంభించాడు. నడిరోడ్డుపై ఈ తంతు దాదాపుగా 20 నిముషాలపాటు సాగింది. దేవ్ గన్ ను దూషించిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తేలింది ఏంటంటే… రైతులు ఇన్ని నెలలుగా ప్రభుత్వంతో పోరాడుతుంటే అజయ్ దేవ్ స్పందించకపోవడం వల్ల ఆలా అనాల్సి వచ్చిందని తెలిపాడు. పోలీసులు ఐపీసీ లోని మూడు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.