After Samantha it’s time for Thamanna to file Case : నిన్న సమంత నేడు తమన్నా కోర్ట్ మెట్లు ఎక్కబోతుంది ?:-

After Samantha it’s time for Thamanna to file Case : అవును మీరు చదివింది మేము చెప్పింది నిజమే. నిన్నటివరకు సమంత కోర్ట్ లో టీవీ చానెల్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ మీద కేసు వేసిన విషయం తెలిసిందే. సమంత మీద చాల నెగటివ్ గా చూపిస్తున్నారని కేసు వేసింది. కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు సమంత మరియు మీడియా బృందం.
ఇలా ఒక పక్క సమంత కేసు పూర్తవకముందే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కోర్ట్ మెట్లు ఎక్కబోతుంది. మ్యాటర్ లోకి వెళ్తే తమన్నా జెమినీ టీవీ లో మాస్టర్ చెఫ్ అనే షో చేస్తుంది అని అందరికి తెలిసిందే. కాకపోతే సడన్ గా తమన్నా ని తీసేసి అనసూయ ని పెట్టుకోవడం తో ఎన్నో విమర్శలకు గురవాల్సి వచ్చింది తమన్నా.
తమన్నా షో లో రాదు అని తెలిసినప్పటినుంచి యూట్యూబ్ చానెల్స్ లో మరియు సోషల్ మీడియా లో తమన్నా మీద నెగటివ్ గా ప్రాజెక్ట్ చేయడం మొదలయింది. మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా తమన్నా క్యారెక్టర్ నెగటివ్ గా చూపిస్తూ వచ్చారు.
అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తరుపున వాదించే లాయర్ అధికారికంగా ప్రెస్ నోట్ వదిలారు. అందులో ఈ విధంగా ఉంది ” తమన్నాని ఎవరు తీసేయలేదు. తమన్నా తో మాట్లాడుకొని ఒప్పందం చేసుకున్న రెమ్యూనరేషన్ సరిగా ఇయ్యకుండా ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ ప్రొడక్షన్ హౌస్ ప్రొఫెషనల్ గా వ్యవహరించడం లేదు అని అందుకే తమన్నా షో నుంచి తప్పుకుంది అని వెల్లడించారు.
దానితోపాటు ఇంతవరకు తమన్నాకు రావాల్సిన రెమ్యూనరేషన్ రాలేదు అని , ఏ విషయం చెప్పకుండా మాట్లాడటం మానేశారని చెప్పారు. ఇప్పుడు అందరికి తమన్నా ని తీసేసి అనసూయ షో లోకి ఎందుకు వచ్చిందనే విషయం పై క్లారిటీ వచ్చింది. చూడాలి మరి తమన్నా వేసిన కేసు పై కోర్ట్ ఎలాంటి తీర్పు ని ఇయ్యబోతుందో.