ఆకాశంలో ఎగిరే విమానం కి పక్షుల గుంపు ఎదురు వస్తే ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

aeroplane crash with birds :: 10 జనవరి 15 2009 వ సంవత్సరం న్యూయార్క్ మంచుతో నిండి పోయి ఉంది ఉష్ణోగ్రత 5 నుంచి 10 డిగ్రీస్ మధ్యలో ఉంది , న్యూయార్క్ లోని లగ్వేర్డియ ఏర్పోర్ట్ లో ప్రయాణాలు కొనసాగుతున్నాయి, us airways flight 3:24 p.m కి ఎగరడానికి సిద్ధమైంది, దాని పైలెట్ “సులెన్ బర్గర్ ” అతని వయసు 58 సంవత్సరాలు ,మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలెట్.
ఫ్లయిట్ నడిపే సమయంలో అతనితో పాటు ఇంకొక పైలెట్ జెఫ్రీ కూడా ఉన్నాడు, అయితే 3:25కి ఫ్లయిట్ ఎగరటం మొదలయ్యి 3:26 కి 2800 అడుగుల ఎత్తులో ఉంది, ఫ్లయిట్ కంట్రోల్ జెఫ్రీ దగ్గర ఉంది, అపుడు ఎం జరిగిందంటే “కెనడా గూజ్ ” అనే పక్షుల గుంపు విమానానికి ఎదురుగా వచ్చాయి , కొన్ని పక్షులు ఇంజన్ లో చిక్కుకు పోయాయి, అయితే కాసేపటికి శబ్ధం రావటం మొదలైంది, ఇది ప్యాసింజర్స్ కి తెలిశాయి కానీ ఈ విషయం పైలెట్స్ కి చెప్పగా వాళ్ళు ఆ విషయం తెలుసుకొని గమనించగా పెద్ద మంటలు రావటం గమనించి భయపడ్డారు.
అపుడు పక్కన ఉన్న “సులెన్ బర్గర్ ” కంట్రోల్ తీసుకొని హ్యాండిల్ చేయసాగాడు , ఫ్లయిట్ నీ 7km లు ఉన్న ఏర్పోర్టు కి తీసుకెళ్దాం అనుకుంటే అక్కడ ఎక్కువ ప్రాణ నష్టం కావచ్చు. అందుకే సమీపం లో ఉన్న నదిలో లాండ్ చేయడానికి సన్నదమయి అందరినీ లైఫ్ జాకెట్స్ వేసుకోమని ఆదేశించారు, ఇక నదిలో లాండ్ అయి అవగానే అక్కడున్న భద్రత సిబ్బంది రంగంలోకి దిగి అందులో ఉన్న passengers ని కాపాడారు.
అలా ప్రాణాలు కాపాడిన సులెన్ బర్గర్ హీరో అయ్యాడు.