Aditi Rao Dreams to do Biopic of Legendary Singer : అదితి రావు కి బయోపిక్ మీద కోరిక కలిగింది :-

Aditi Rao Dreams to do Biopic of Legendary Singer : అదితి రావు యొక్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటన మిగితా హీరోయిన్స్ కంటే చాల కొత్తగా మరియు ఆన్ స్క్రీన్ లో స్పెషల్ గా ఉంటుంది. అదితి రావు చేసిన సినిమాలలో సమ్మోహనం , నాని వి సినిమా , చెలియా లో తన నటన కోసమే పదేపదే థియేటర్లో చుసిన జనాలు ఉన్నారు. ఆమె ఆన్ స్క్రీన్ లో చాల స్పెషల్ గా ఉంటుంది.
అలాంటి అదితి రావు ప్రస్తుతం తెలుగు లో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ తో కలిసి చేసిన మహా సముద్రం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14 న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాకి సంబందించిన ప్రొమోషన్స్ భాగంగా అదితి ఇంటర్వ్యూ ఇయ్యగా , ఆ ఇంటర్వ్యూ లో తన చిరకాల కోరికను వెల్లడించింది.
అదేంటంటే లెజెండరీ క్లాసికల్ సింగర్ అయినా యమ్.యస్.సుబ్బలక్ష్మి గారి బయోపిక్ తీయాలని ఎప్పటినుంచో తాను కంటున్నా కల అంట. ఎవరైనా సుబ్బలక్ష్మి గారి బయోపిక్ క్లాసిక్ గా తీయాలనుకుంటే తాను చేయడానికి రెడీ అని చెప్పకనే చెప్పేసింది అదితి రావు.
ఏదేమైనా అదితి లుక్స్ మరియు ఆన్ స్క్రీన్ అందానికి తన కోరిక చాల పర్ఫెక్ట్ అని అందరు అనుకుంటున్నారు. సుబ్బలక్ష్మి గారి గా అదితి పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూడాలి మరి అదితి కోరిక ఎపుడు నెరవేరుతుందో. దీనికంటే ముందు అదితి మహాసముద్రం తో బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుందాం.