Entertinementtelugu cinema reviews in telugu language

Adbutham Movie Review | హిట్టా ఫట్టా :-

Adbutham Movie Review

సినిమా :- Adbutham (2021) Review

నటీనటులు :- తేజ సజ్జ , శివాని రాజశేఖర్ , సత్య మొదలగు.

నిర్మాతలు :- చంద్ర శేఖర్

సంగీత దర్శకుడు :- రధన్

డైరెక్టర్ :- మాలిక్ రామ్

ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story ( Spoiler Free) :-

ఈ కథ సూర్య (తేజ సజ్జ ) ఆఫీస్ పైననుంచి దూకి చనిపోవాలని , ఇంకో పక్క వెన్నెల ( శివాని రాజశేఖర్) నీళ్లలో దూకి చనిపోవడానికి ఇద్దరు వేరే వేరే ప్రదేశాలలో చావుకి సిద్ధం అవ్వగా సడెన్ గా సూర్య తన చావుకి ఎవరు బాధ్యులు కారు అని తన సెల్ నెంబర్ కి తానే మెసేజ్ చేసుకొని చనిపోవడం బెటర్ అని మెసేజ్ పంపించి దూకే ప్రయత్నం చెయ్యగా..

ఆకాశం లో జరిగే వింతపరిణామాలకు సూర్య పంపిన మెసేజ్ వెన్నెల కి వెళ్తుంది. వెన్నెల షాక్ అయి తన నెంబర్ కి ఎలా మెసేజ్ వచ్చిందని వెంటనే ఆ మెసేజ్ కి రిప్లై ఇయ్యడం తో అవతలపక్క దూకపోతున్న సూర్య వరుస మెసేజీలు రావడంతో ఓపెన్ చేసి చుస్తే తాను పంపిన మెసేజ్ కి రిప్లై రావడం చూసి షాక్ అవుతాడు.

అస్సలు తన నెంబర్ కి తానే మెసేజ్ పంపుకుంటే ఎవరో రిప్లై ఇయ్యడం ఏంటి అని ఆలోచనలోపడుతాడు. ఇద్దరు సూసైడ్ చేసుకునే ఆలోచన వదులుకొని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. ఆలా కొన్ని రోజులలో వీరిద్దరి మధ్య పరిచయాలు బాగా పెరిగిపోతుంది. ఆలా ఇద్దరు ఒకరోజు కలుసుకోవాలని ఫిక్స్ అయ్యి క్లాక్ టవర్ దగ్గర మీటింగ్ ఫిక్స్ చేసుకుంటారు. ట్విస్ట్ ఏంటంటే వెన్నెల 2014 లో ఉంది. సూర్య 2019 లో ఉన్నాడు. ఇద్దరు ఈ విషయం తెలుసుకొని షాక్ అవుతారు.

అస్సలు ఇదంతా ఎలా జరుగుతుంది? 2014 లో ఉన్న వెన్నల మరియు 2019 లో ఉన్న సూర్య మధ్య ఎలా కనెక్షన్ మొదలయింది ? అస్సలు ఇదంతా ఎలా సాధ్యం ? సూర్య ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? వెన్నెల కి సూర్య కి అప్పట్లో ఏమైనా కనెక్షన్ ఉందా? చివరికి ఎం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా హాట్ స్టార్ లో చూడాల్సిందే.

Positives👍 :-

  • తేజ సజ్జ మరియు శివాని రాజశేఖర్ ఇద్దరు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టే థ్రిల్లింగ్ గా సాగుతుంది.
  • కథ మరియు కథనం.
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • దర్శకుడు సినిమాని చాలా బాగా చిత్రీకరించారు.
  • ముఖ్యంగా చివరి 30 నిముషాలు ప్రేక్షకులని స్క్రీన్ కి కట్టిపడేస్తుంది
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • ఎడిటింగ్ బాగుంది.

Negatives👎 :-

  • పాటలు పెద్దగా అలరించవు.
  • కొన్ని లాజిక్స్.

Overall :-

మొత్తానికి అద్బుతం అనే సినిమా చాలా కొత్తగా మరియు అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా అలరిస్తుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. తేజ మరియు శివాని ఇద్దరు పాత్రలో జీవించి సూర్య మరియు వెన్నెల పాత్రలకు తగిన న్యాయం చేశారు. వీరిద్దరి చుట్టే తిరిగిన ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు తీసిన విధానం బాగుంది.

కథ మరియు కథనం చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలే పెద్దగా ఆలరించవు. మొత్తానికి అద్భుతం అనే సినిమా ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన సినిమా. చివరి 30 నిముషాలు ప్రేక్షకులని స్క్రీన్ కి కట్టిపడేస్తుంది. ఈ వారం కుటుంబం అంత కలిసి చూడవలసిన సినిమా.

Rating :- 3.5 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button