Adavi Sesh Admitted in Hospital : హాస్పిటల్ లో అడ్మిట్ అయినా అడవి శేష్ :-

Adavi Sesh Admitted in Hospital : థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరు అడవి శేష్. తీసిన ప్రతి సినిమా ప్రజలకు విపరీతంగా నచ్చేలా చేయడం లో ఎక్స్పర్ట్. ఒకొక సినిమా ఒకొక థ్రిల్లర్ గా రూపొందిస్తారు. ప్రస్తుతం మేజర్ సినిమాతో బిజీ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా శేష్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే వారం రోజులుగా అడవి శేష్ హెల్త్ బాలేదని.. డెంగ్యూ ఫీవర్ తో బాధ పడుతున్నారని తెలిసింది. హెల్త్ బాలేకపోవడం షూటింగ్ కూడా ప్రస్తుతానికి ఆపేసారు.
అయితే ఇపుడు శేష్ ఆరోగ్యం మరింత క్షీణించిందని బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయి అని శేష్ సన్నిహితులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అడవి శేష్ ని డాక్టర్స్ అందరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
శేష్ ఆరోగ్యం లో ఏదైనా మార్పులు వస్తే డాక్టర్స్ వెంటనే అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. శేష్ హెల్త్ నార్మల్ అయి డెంగ్యూ ఫీవర్ నుంచి త్వరల కోలుకోవాలని , ఎప్పటిలాగా ఆరోగ్యాంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.