movie reviewstelugu cinema reviews in telugu language

Adavalu meku Joharlu Movie Review :-

Adavalu Meku Joharlu Movie Review

Movie :- Adavalu Meku Joharlu (2022) Review

నటీనటులు :- శర్వానంద్ , రష్మిక , రాధిక, కుష్బూ మొదలగు

నిర్మాత :- సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్

దర్శకుడు :- తిరుమల కిషోర్

Story ( Spoiler Free ):-

ఈ కథ చిరు ( శర్వానంద్ ) కి అనేకరకాల పెళ్ళి సంబంధాలు రావడం ఏదో ఒక వంక పెట్టీ అతని ఫ్యామిలీ మెంబెర్స్ సంబంధం వదనుకోడంతో మొదలవుతుంది. చిరు కూడా విసిగిపోయేంత రేంజ్ లో వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలోనే చిరు ఆధ్య ( రష్మీక ) నీ ప్రేమించడం మొదలుపెడతాడు. అని సాఫీగా జరుగుతుంది అని అనుకునే లోపే ఆధ్య కి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పడంతో బ్రేక్.

అస్సలు ఎ కారణాల చేత చిరు ఫ్యామిలీ మెంబెర్స్ సంబంధాలు రిజెక్ట్ చేస్తున్నారు ? చిరు మరియు ఆధ్య మధ్య ప్రేమ ఎలా మొదలైంది ? ఆధ్య ఎందుకు పెళ్ళి చేసుకోను అని చెప్పింది ? ఆధ్య తల్లి ఫ్లాష్ బ్యాక్ ఎంటి ? చివరికి ఎం జరిగింది ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

Positives 👍:-

  • శర్వానంద్ మరియు రాష్మీక బాగా నటించారు. ఇద్దరు పాత్రలో ఒదిగిపోయి నటించారు.
  • కొన్ని డైలాగ్స్ మరియు క్లైమాక్స్ సెంటిమెంట్.
  • దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
  • సినిమాటోగ్రఫీ బాగుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎:-

  • పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయిన కధనం సరిగ్గా రాసుకోలేదు.
  • దర్శకత్వం
  • ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
  • పాటలు కూడా పెద్దగా అక్కటుకోవు.

Overall :-

మొత్తానికి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా శర్వానంద్ మరియు రాష్మిక నటనతో ఎంత అలరించాలని ట్రై చేసిన దర్శకుడు కధనం సరిగా రాసుకోకపోవడం తో విఫలం అయింది. కథ రొటీన్ , కధనం కొత్తగా రాసుకునింటే యావరేజ్ టాక్ అయినా వచ్చేది. స్టార్ కాస్టింగ్ నీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.

ఎడిటింగ్ అస్సలు బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే పెరఫార్మన్సెస్ తో ప్రేక్షకులని సినిమాతో కట్టిపడేయలేము. ఎమోషనల్ మరియు కాస్త ఫన్ కంటెంట్ కోసం ఈ వారం ఒకసారి ట్రై చేయచ్చు.

Rating:- 2.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button