Tollywood news in telugu

ఈరోజు సాయంత్రం 4 గంటలకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ !!!

ఈరోజు సాయంత్రం 4 గంటలకు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌
చేతుల మీదుగా మాస్‌ హీరో విశాల్‌ ‘యాక్షన్‌’ ట్రైలర్‌ రిలీజ్‌
మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నారు.
మాస్‌ హీరో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: శ్రీనివాస్‌ ఆదెపు, దర్శకత్వం: సుందర్‌ సి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button