Acharya: ఆచార్య వచ్చేస్తున్నాడు..మీరు రెడీయేనా?

Acharya: మెగాస్టార్ ఖైదీ 150 సినిమాతో మళ్లీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సైరా నర్సింహారెడ్డి వంటి సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి చిత్రం చేసిన తర్వాత మెగాస్టార్ ఎన్నో కథలు విన్న.. అందులో దర్శకుడు కొరటాల శివ చెప్పిన కథే నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ మేరకు కొరటాల శివ , చిరంజీవి కాంబోలో వస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మంచి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఆచార్య చిత్రానికి సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్.. గుడి సెట్ వీడియో.. ‘సిద్ధ’గా చరణ్ బ్యాక్ లుక్ ను మినహా ఏం విడుదల చేయలేదు. ఈ విషయంపై మెగాస్టార్ కొరటాల శివతో టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అంటూ ఫన్నీగా కన్వర్జేషన్ జరిగింది.

తాజాగా చిత్ర యూనిట్ ఆచార్య టీజర్ ను జనవరి 29న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నామని ఓ అప్డేట్ ఇచ్చింది. దీంతో అభిమానులు ఆచార్య టీజర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు తెరకెక్కిస్తుడాగా.. కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు