హైదరాబాద్ అమీర్ పేట్ సర్కిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం !

హైదరాబాద్ అమీర్‌పేట్ సర్కిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ రోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున వేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగింది.
ఈ దారుణమైన ప్రమాదంలో ఓ యువకుడి తల మెట్రో స్టేషన్ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మరో యువకునికి తీవ్ర గాయాలతో మృత్యువునుండి బయటపడ్డాడు.
వెంటనే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించడానికి ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
పోలీసులు ప్రజలనుద్దేశించి ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చారంటే చాల జాగ్రత్తగా వ్యవహరించాలని, అతివేగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తిచేశారు.