Actress simran choudhary – సిమ్రాన్ చౌదరి గురించి మరింతగా

Actress simran choudhary: ఇటీవలే పాగల్ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు, మొదటి సినిమాతో కుర్రగాల హృదయాల్ని దోచేసుకుంది. ఇపుడు ఎక్కడ చుసిన , ఎక్కడ విన్న ఈ అమ్మడు గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అంతలా ఈ ముద్దుగుమ్మ కుర్రగాల మనసును దోచేసుకుంది.

సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఈ అమ్మాయి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫాలోయర్స్ మస్త్ గా పెరిగారు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇపుడు ఈ అమ్మాయి గురించే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం.
మీ అందరికి సిమ్రాన్ ఈ సినిమా నుంచే తెలిసి ఉంటుంది కానీ, ఆమె 2014 లో విడుదలైన హమ్ తుమ్ అనే సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాకపోతే ఆ సినిమా అప్పట్లో పెద్దగా ఆడకపోవడం తో ఈ అమ్మడుని అపుడు గుర్తించలేకపోయారు.

Actress simran choudhary Career
ఇదిలా ఉండగా ఆమె 2012 లో మిస్ ఆంధ్రప్రదేశ్ గా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్ గా మరియు 2017 లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ గా అవార్డులు పొందింది.
వీటన్నింటికి ముందు ఆమె ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ లో పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్ మరియు నటన కొనసాగించాలని ఉద్యోగం మానేసి పూర్తిగా వీటి మీద శ్రద్ధ పెట్టి విజయం సాధిస్తూ వచ్చింది. అప్పట్లో తాను ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టే ఇపుడు మీ హృదయాల్ని పాగల్ చేసేసింది.
ఇదిలా ఉండగా ఈమె 2018 లో టాలెంట్ సెర్చ్ర్ ఇండియన్ రియాలిటీ షో లో మరియు ఇండియా నెక్స్ట్ సూపర్ స్టార్స్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చింది.
ఇవ్వని పక్కన పెడితే ఈమె రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ , క్లాసికల్ డాన్సర్ మరియు డాగ్ లవర్. ఇష్టాల పరంగా చుస్తే ఈమెకి బట్టర్ చికెన్ మరియు మెక్సికన్ ఫుడ్ అంటే చాల ఇష్టం.
ఈ పాగల్ ఇచ్చిన విజయం ద్వారా ఇలాగే ప్రేక్షాకులని, కుర్రగాలని మరిన్ని సీనిమాలతో కట్టిపడేస్తుంది అని కోరుకుందాం.