Abijit: బిగ్ బాస్4 విన్నర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హిట్ మాన్ రోహిత్ శర్మ

బిగ్ బాస్4 విన్నర్ అభిజిత్.. ఇతనికి ఆ కప్పు ఊరికే రాలేదు. హౌస్ లో మొదట అందరితో వైరుధ్యాలు, 11 సార్లు నామినేషన్లు, గాయాలతో బాధపడుతున్న కానీ ఫిజికల్ టాస్క్ లో ఇవన్నీ పక్కకు పెట్టి పోరాడేవాడు. టాస్క్ లను మైండ్ గేమ్ తో ఆడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఇంటలిజెంట్ గా పేరుగాంచాడు. అతడి థింకింగ్ కి, క్లారిటీ కి ,కూల్ నెస్ కి అమ్మాయిలు ఫిదా అయిపోయారు.
మరి అలాంటి బిగ్ బాస్ ఫోర్ విన్నర్ అభిజిత్ కి క్రికెటర్ రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తానని పలు సందర్భాల్లో అభిజిత్ చెప్పిన విషయం తెలిసిందే.

మరి అభిజిత్ కి ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మంచి గిఫ్ట్ వచ్చింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఉన్న ఇండియా క్రికెటర్ హనుమా విహారి.. బిగ్ బాస్ గురించి రోహిత్ శర్మ తో చర్చించుకున్న సందర్భంలో మన తెలుగు బిగ్ బాస్ 4 విన్నర్ గురించి చెప్పాడు. అతనికి నువ్వంటే చాలా ఇష్టమని నీకు పెద్ద ఫ్యాన్ అని విహారి రోహిత్ కి చెప్పాడు.
దీంతో హిట్ మాన్ అభిజిత్ కి ఫోన్ చేసి..కంగ్రాట్స్ చెప్పి సరదాగా కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత రోహిత్ తన జెర్సీపై సైన్ చేసి అభిజిత్ కి గిఫ్ట్ గా హనుమ విహారి తో పంపించాడు. దీంతో అభిజిత్ హిట్ మెన్ గిఫ్ట్ పంపడంతో ఆ జెర్సీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు