Abbas Actor : ఆ కారణంగానే సినిమాలను వదిలేసా అంటూ….ఆసక్తికర విషయాలను బయటపెట్టిన అబ్బాస్..!

Abbas Actor : అబ్బాస్ గతం లో తక్కువ సినిమాలు చేసినప్పటికీ మరచిపోలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హీరో గా 1996 టైం లో అబ్బాస్ పేరు వినగానే లవర్ బాయ్ అని అనేవారు అందరు. అబ్బాస్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అందులో ‘ప్రేమదేశం’ సినిమా సూపర్ హిట్ కావడంతో యూత్ గుండెల్లో నిలిచిపోయాడు.
కొంతకాలం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అదేవిదంగా తమిళ్ లో రెండు సీరియల్స్ లో, 2016లో ఒక మలయాళం సినిమా లో చేసి అబ్బాస్ తెరపై కనుమరుగు అయ్యారు.
ఇపుడు అబ్బాస్ సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. తాజాగా ఆయన సినిమాలకు దూరంగా ఎందుకు వెళ్లిపోయారు అనే ఒక మీడియా వేసిన ప్రశ్నకు సమాధానంగా కొన్ని కారణాలను ఈ విదంగా చెప్పుకొచ్చారు.
తాను సినిమాల్లో నటించడం మొదట్లో చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని , కొన్ని రోజుల తరవాత సినిమా అంటేనే బోర్ అనిపించింది. ఆ కారణం వల్లనే నటనకు న్యాయం చేయలేనని అనిపించి సినిమాలకు దూరంగా రావలసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.